Thursday, February 5, 2009

ఏడవ పాశురం

కీచు కీచు ఎన్రు ఎంగుం ఆని చాత్తాన్ కలందు
పెసిన పెచ్కారవం కేట్టిలైయో పెయ్ప్ పెన్నే
కాసుం పిరప్పుం కలకలప్ప కై పేర్తు
వాస నరున్గ్కు లల్ ఆయచ్సియర్ మత్తినాల్
ఓసై పడుత్త తయిరరవం కేట్టిలైయో
నాయక పెన్ పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి
కేశవనై పాడవుం నీ కేట్టే కిడత్తియో
దేసముడైయాయ్ తిరవేలోర్ ఎంబావాయ్


కిల కిల మంటూ అన్ని ప్రాంతాలలో భరత పక్షులు గుంపుగా
చేయు శబ్దములు వినిపించటం లేదా ! మొద్దు పిల్లా !
కాసుల పేర్ల గల గల మనే చప్పుళ్ళు చేతుల కదలికలతో
కమ్మని వాసనతో గుభాళించే కురులులు గల గోపికా స్త్రీలు
కవ్వముతో పెరుగులో చేస్తున్న శబ్దాలను వినటము లేదా ?
నాయకురాలైన ఓ చెలీ, నారాయణ మూర్తి ని,
కేశవుని గురించి పాడుతున్నవి వింటూ కూడా ఇంకా శయనించే ఉన్నావా?
తలుపు తెరవవే చెలీ.

No comments:

Post a Comment