కనైత్తిలన్ కట్రెరుమై కనృక్కు ఇరంగి
నినైత్తు ములై వళియే నిన్రు పాల్ సోర
ననైత్తిల్లం సేరాక్కుం నర్ సెల్వన్ తంగాయ్
పనిత్తలై వీళ నిన్ వాచార్ కడై పట్రి
సినత్తినాల్ తేన్నిలన్గై కొమానై సిత్ర
మనత్తుక్కు ఇనియానై పాడవుం నీ వాయ్ తిరవాయ్
ఇనిత్తాన్ ఎలున్దిరాయ్ ఈదెన్న పేరురక్కం
అనైత్తిల్ల తారం అరిందు ఎలోర్ ఏమ్పావాయ్.ఆకలి గా ఉన్న తమ లేగ దూడలను పశువులు ప్రేమగా పిలుస్తూ
వాటి కోసం అవిరామముగా పాలను ధారలుగా శ్రవిస్తున్నవి
ఆ పాలతో ఇల్లంతా తడిసిపోయింది. ఓ భాగ్యవంతుని చెల్లెలా,
తలల పై మంచు కురుస్తుండగా మేము నీ తలవాకిట నిలిచి ఉన్నాము
కోపించి దక్షిణాన ఉన్న లంక రాజును నాశనం చేసిన వాని గూర్చి
మనసు కు ఆహ్లాదము కలిగేట్లుగా పాడుతూ ఉంటే నీవు నోరు తెరువవేమి?
ఇప్పటికైనా లేవమ్మ ! ఇదేమీ మొద్దు నిద్ర?
ఇంట్లో అందరకూ ఈ విషయము తెలుసా చెలీ?
Thursday, February 5, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment