పుళ్ళిన్ వాయ్ కీన్దానై పొల్లా అరక్కనై
కిల్లి కలైన్దానై కీర్తి మై పాడి పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావై కళంబుక్కార్
వెళ్లి ఎళుందు వ్యాలన్ ఉరన్గిత్రు
పుళ్ళుం శిలంబిన కాన్ పోదరి కన్నినాయ్
కుళ్ళ కులిర కుడైందు నీరాడాదే
పల్లి కిడత్తియో! పావాయ్! నీ నాన్ నాళాల్
కళ్లం తవిరందు కలందేలోర్ ఎంబావాయ్.
పక్షి నోరు చీల్చిన వాడు, దుష్టులైన రాక్షసుల
తలలు త్రుంచిన వానిని గూర్చి కీర్తించి పాడుతుండగా
అమ్మాయిలందరూ వ్రతము చేసుకొనే చోటికి చేరారు
శుక్రుడు ఉదయించాడు , గురువు నిదురించటానికి వెళ్ళాడు.
పక్షులు కల కల రావాలు చేసున్నాయి. భ్రమరముల వంటి కన్నులు కలదానా చూడు,
కఠినమైన చల్లని నీటిలో మునిగి స్నానము చేయక
శయ్య పై నిదురిస్తున్నావా ? పిల్లా ! ఈ సుదినమున
నీ జిత్తులు మాని అందరిలో కలవవె చెలీ!
Thursday, February 5, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment