మాయనై మన్ను వడ మదురై మైందనై
తూయ పెరు నీర్ యమునై తురైవనై
ఆయర్ కులత్తినిల్ తోనృం అని విళక్కై
తాయి కుదల్ విళక్కం సేయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవిత్ తొలుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయా పిళైయుం పుగుదరువాన్ నింరనవుం
తీయినిల్ తూశాగుం సెప్పేలోర్ ఎంబావాయ్
ఉత్తరపు వైపున ఉన్న మధురకు రాకుమారుడైన మాయగాడు
పవిత్ర జలాలతో నిండి ఉన్న ఘనమైన యమున ఒడ్డున నివసించే
గోకులం లో జన్మించి కులానికే మణి దీపమై,
తల్లి గర్భమునకు పేరు తెచ్చిన దామోదరుని
మనము పరిశుభ్రమై వచ్చి చక్కని పూలతో పూజిద్దాం
నోరార పాడి మనసార ద్యానిద్దము.
తద్వారా చేసిన పాపములు, జరగ బోయే దినాల్లోనివి కూడా
నిప్పులో వేసిన దూది వలె కాలిపోవునే చెలులారా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment