Thursday, February 5, 2009

పదవ పాశురం

నోట్రుచ్చు వర్గం పుగుగిన్ర అమ్మానాయ్!
మాట్రముం తారారో వాశల్ తిరవాదార్
నాత్రట్టులాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోట్రప్ పరై తరుం పున్నియనాల్ పండు ఒరు నాల్
కూట్రత్తిన్ వాయి వీల్నడ కుమ్బకర్ణనుమ్
తోట్రుం ఉనక్కే పెరున్తుయిల్ తాన్ తందానో
ఆట్ర అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేట్రమాయ్ వందు తిరవేలోర్ ఎంబావాయ్.

ఇది స్వర్గమునకు చేర్చే నోమే అమ్మాయీ !
మాట్లాడక మిన్నకున్నావేమి? తలుపు తెరువవేమి?
కమ్మటి తులసి ని తలపై దాల్చిన నారాయణుని మనము
కీర్తిస్తే పుణ్య ఫలాలు వరాలుగా ఇస్తాడు . ఒక నాడు
మృత్యువు నోట పడిన కుంభకర్ణుడు
ఓడి నీకు ఆ మొద్దు నిద్రను తాను ఇచ్చాడా?
పూర్తిగా నిద్రను గెలవాలమ్మ! మాలో మాణిక్యం వంటి దానా,
చెప్పినది అర్థం చేసుకొని తలుపు తెరువవే చెలీ !

No comments:

Post a Comment