Thursday, February 5, 2009

మూడవ పాశురం

ఓణ్గి ఉలహలన్ద ఉత్తమన్ పెర్పాడి
నాంగళ్ నమ్పావైక్కు చాట్రి నీరాడినాల్
తీన్గిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పైదు
ఒన్గు పెరుం చెన్నల్ లోడు కయలుగల
పూంగు వలై పోదిల్ పోరివండు కన్పడుప్ప
తేన్గాదే పుక్కిరందు శీర్తములై పట్రి
వాన్గ కుడం నిరైక్కుం వళ్ళల్ పెరుమ్పసుక్కల్
నీంగాద సెల్వం నిరైన్దేలో రేమ్పావాయి


విక్రమము గ మూడు లోకాలను కొలిచిన ఉత్తముని గూర్చి పాడి
మనము వ్రతమును ఆచరించి స్నానాలు చేస్తే,
ఆ ప్రాంతంలో, కీడు లేక ముక్కాలాలు వానలు కురుస్తాయి
ఏపుగా పెరిగిన బలమైన వరిపంట చేలలో చిరు చేపలు నాట్యమాడుతాయి
అందమైన కలువ పూలలో భ్రమరాలు మత్తుగా నిదురిస్తాయి
గోపా బాలురు నిర్భయముగా నిరంతరాయముగా స్రవిస్తున్న క్షీర ధారలను
బలమైన గోవులనుండి కడవలతో పొందుతారు
అలా తరగని సంపదలతో దేశం నిండు తుంది చెలులారా!!

No comments:

Post a Comment